NZB: వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్, పడగల్ గ్రామాలలో మంగళవారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎర్ర జొన్న సాగు- విత్తన ఒప్పందంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజు పాల్గొని రైతులకు ఎర్ర జొన్నసాగు గురించి అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ లాభాలు అందించే పంటలకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.