KRNL :పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ మంగళవారం సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను ఆయన పరిశీలించారు. ఆఫీసుకు వచ్చిన రైతుల సమస్యలను తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. కార్యాలయానికి వచ్చే వినతులపై విచారణ చేసి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.