VZM: జామిలో మద్యం సేవించి స్కూటీ నడిపిన కొట్టాం గ్రామానికి చెందిన నక్కెళ్ల ఎర్రినాయుడుకు కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించిందని SP దామోదర్ మంగళవారం తెలిపారు. ఈ నల 9న విసినిగిరి జంక్షన్ వద్ద వాహన తనిఖీల సమయంలో మద్యం సేవించి స్కూటీ నడిపిన నిందితుడిని జామి పోలీసులు పట్టుకున్నారు. సాక్ష్యాధారాలతో కోర్టులో హాజరుపరిచిన తరువాత శిక్ష ఖరారైంది.