ASR: ఈగల్ ఆధ్వర్యంలో అరకులోయ మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం విద్యార్థినిలకు డ్రగ్స్ దుష్ప్రభావాలను వివరించారు. గంజా వంటి డ్రగ్స్‌తో కలుగు శారీరక, మానసిక సమస్యలను ప్రిన్సిపల్ చలపతిరావు విద్యార్థులకు వివరించారు. గంజా సాగు, రవాణ, వినియోగంతో అమలయ్యే శిక్షల గురించి ఈగల్ సీఐ రమేష్ రుద్ర తెలిపారు. డ్రగ్స్ అలవాటు కాకుండా పాటించవలసిన నియమాలను ఆయన వివరించారు.