MNCL: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటిస్తారని జిల్లా నాయకులు తెలిపారు. భీమారంలో కేజీబీవీ నూతన భవనాన్ని ప్రారంభించి గొల్లవాగు ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లలను విడుదల చేస్తారు. అనంతరం చెన్నూర్ మండలం శివలింగాపూర్లో పత్తి కొనుగోలు కేంద్రం, కోటపల్లి మండలం దేవులవాడలో నూతన సబ్ సెంటర్ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.