WG: గ్రామాభివృద్ధికి పంచాయతీ అభివృద్ధి అధికారులు కృషి చేయాలని పీ-4 నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే.మల్లికార్జున రావు సూచించారు. మంగళవారం పెంటపాడు మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచులు, పంచాయతీ అభివృద్ధి అధికారులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుని పంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు.