AP: అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్పై మాజీ సీఎం జగన్ వెనక్కి తగ్గారు. ఈనెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవుతానని సీబీఐ కోర్టుకు తెలిపారు. యూరప్ పర్యటనకు వెళితే ఈనెల 14వరకు కోర్టుకు హాజరు కావాలని గతంలో జగన్ను సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.