KDP: సీఎం చంద్రబాబు చిన్నమండెం పర్యటన నేపథ్యంలో కడప విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లపై జిల్లా SP షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్ట్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (A.S.L) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా SP పోలీసు శాఖతోపాటు ఇతర విభాగాల అధికారులకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.