కోనసీమ: ఆత్రేయపురం మండలం వేలేరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నాగిరెడ్డి సురేఖ తన కుమారుడు పవన్ను స్కూల్ బస్ ఎక్కించడానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె కుమార్తె హరిణి వరలక్ష్మి (7) సైతం వాళ్లతో వచ్చింది. అన్నయ్య స్కూల్ బస్సు ఎక్కుతుండగా చిన్నారి అటు వైపు పరిగెత్తింది. ఈ క్రమంలో పాప వెనుక చక్రాల కిందపడి చనిపోయింది.