ఢిల్లీ పేలుడు ఘటనపై ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ ఘటనలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని గుర్తించి వారిని మట్టుబెట్టాలని అధికారులను అమిత్ షా ఆదేశించారు. దేశానికి చెందిన ప్రతి ఏజెన్సీకి చెందిన అధికారులు నిందితులను వెతికే పనిలో నిమగ్నమైనట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.