JGL: కథలాపూర్ మండల కేంద్రంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలు మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవంలో క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేశారు. వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పోటీలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి చక్రధర్, ఎంఈవో శ్రీనివాస్ సహా అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.