ADB: ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని జిల్లా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొలం గిరిజన ఆశ్రమ బాలురు పాఠశాలను ఆయన సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని పేర్కొన్నారు.