SRPT: సరైన తేమశాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా వెంటనే కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్నిఆలస్యం చేయకుండా వెంటనే మిల్లులకు పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ తిరుమలగిరి మండలంలోని తొండ, కోక్యా నాయక్ తండా, ఫణిగిరిలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.