నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న K.రమేష్, స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. అలాగే, సీపీఎస్ రద్దు చేసి, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలన్నారు.