SKLM: జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రమణమూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం నిర్మాణంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు అన్నారు. నేటి యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.