BDK: ITC బంగారు భవిష్యత్ ప్రోగ్రాం ద్వారా బైఫ్ స్వచ్చంద సంస్థ వారు భద్రాచలం రామాలయం గోశాలలో ఉచిత పశువైద్య శిబిరాన్ని ఇవాళ నిర్వహించారు. డా.బాలకృష్ణ గోశాలలోని ఎదకు రాని, చూడి నిలువని 30 అవులకు పరీక్షలు చేసి చికిత్సలు చేశారు. అనంతరం 20 దూడలకు నట్టల మందు తాగించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా పశువైద్య, పశుసంవర్ధక అధికారి డా. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.