ఫోన్లో ఉండే కొన్ని యాప్స్ వల్ల ఛార్జింగ్ ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫోన్ బ్యాటరీని తినేసే యాప్‌లకు 2026 మార్చి1 నుంచి చెక్ పెట్టనుంది. బ్యాటరీ డ్రెయిన్ చేసే యాప్‌లకు సంబంధించి ప్లే స్టోర్‌లో హెచ్చరికలు చూపనుంది. ఈ ఫీచర్‌ను గూగుల్ ఇప్పటికే శాంసంగ్‌తో కలిసి పరీక్షించింది.