AP: విశాఖ సదస్సు దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. ఫైర్ సేఫ్టీ అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రముఖులు, ప్రతినిధులు ఉండే హోటళ్ల వద్ద భద్రతపై దృష్టి పెట్టాలన్నారు. డ్రోన్, CC కెమెరాల పర్యవేక్షణలో విశాఖ ఉంటుందని తెలిపారు. SDRF బృందాలు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయానికి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని సూచించారు.