బీహార్లో రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం ఐదుగంటల సమయానికి రికార్డు స్థాయిలో 67.14 శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఓటింగ్ సరళి ఇలాగే కొనసాగితే 70 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మలి విడతలో 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. కాగా ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి.