కోనసీమ: తుఫాన్ బీభత్సంతో కోనసీమ జిల్లాలో చాలా నష్టం జరిగిందని కేంద్ర బృందానికి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వివరించారు. ఇందులో భాగంగా నష్టాన్ని పునఃసమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు జిల్లాలో పర్యటించారు. ఈ మేరకు మొత్తం 1.6 లక్షల ఎకరాలు సాగు కాగా, అందులో 70 వేల ఎకరాలు నష్టపోయాయని తెలిపారు. ఇందులో అధికంగా స్వర్ణ(7029) వంగడం పంట నష్టపోయిందని పేర్కొన్నారు.