MDK: తూప్రాన్ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తూప్రాన్ ఆర్డివో జయచంద్రారెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని పేర్కొన్నారు.