E.G: ‘పరిశ్రమలు – ఉపాధి కల్పన’ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించడం హర్షణీయమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి ఆయన పాల్గొన్నారు. పరిశ్రమలను విస్తరించడంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అనంతరం యువతకు ఉపాధి కల్పనే ప్రభుత్వ ద్యేయమన్నారు.