వరంగల్: ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అలెర్ట్ అయింది. కేంద్ర భద్రత, నిఘా విభాగం సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత రామప్ప దేవాలయం వద్ద బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. పోలీసు జాగిలం, మెటల్ డిటెక్టర్‌తో పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పర్యటకుల రాకపోకలు, అనుమానితుల కదలికపై నిఘా పెట్టారు.