MNCL: ఈనెల 15న నిర్వహించే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి రూరల్ CI హనోక్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించబడతాయన్నారు.