AP: TDP అధ్యక్షుడు శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి కార్యకర్తే అధినేత అని లోకేష్ అన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీలో ప్రధాన్యం ఉండాలన్నారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడినట్లే జోనల్ కోఆర్డినేటర్లు పనిచేయాలని.. అధికారం వచ్చిందనే నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రణాళిక మేరకు పనిచేయాలని సూచించారు.