HYD: తెలంగాణలోని ప్రభుత్వపాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులప్రతిభను గుర్తించేందుకు “విద్యార్థుల వార్షిక పోటీలు-2025” పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని టి-సాట్ CEOబోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. టీ-సాట్ వేదికగా NOV 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి ఫైనల్ పోటీల్లో క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ విభాగాలకు సంబంధించి దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొంటారన్నారు.