కృష్ణా: అయ్యంకి గ్రామంలో వరి కోతలు కోసి ధాన్యం విక్రయిస్తున్న రైతులను చూసి, అటు వైపు వెళుతూ ఆగి దాన్యం రాశులను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీరు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం తగ్గించుకోవాలన్నారు.