రాజ్కోట్ వేదికగా దక్షిణాఫ్రికా-A జట్టుతో జరుగుతున్న మొదటి అనధికార వన్డేలో భారత్ ఇన్నింగ్స్ కొనసాగుతోంది. 286 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (31), రియాన్ పరాగ్ (8) పరుగులు చేశారు. ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్ (50*), తిలక్ వర్మ (1*) క్రీజ్లో ఉన్నారు.