సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని వైయస్ఆర్ కాలనీలో ఈనెల 9న జరిగిన మాలిక్ బాషా హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు రెండవ పట్టణ సీఐ రెడ్డెప్ప తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ కలహాలతో భార్యతో తరచు గోడవపడే వారని తెలిపారు. బావమరిది జనార్దన్ పులకుండితో దాడి చేయడంతో మృతి చెందినట్లు తెలిపారు.