SRD: కోహిర్ మండలం కొత్తూరు(డి) గ్రామంలో మంగళవారం గ్రామ దేవత ఊరడమ్మ బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటి నుంచి ముత్తయిదువ మహిళలు బోనమెత్తి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఇందులో శివసత్తులు, పోతరాజుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఊరడమ్మ ఆలయానికి చేరుకొని, గుడి చుట్టూ బోనంతో ప్రదక్షిణాలు వేసి, అమ్మవారికి నైవేద్యం, బోనాలు సమర్పించారు.