W.G: జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, ఔత్సాహికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని కలెక్టర్ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని వర్చువల్గా సీఎం చేసిన శంకుస్థాపనలను తిలకించారు. సీఎం వివిధ రంగాల్లో 48 పరిశ్రమలకు శంకుస్థాపనలు, 4 పరిశ్రమలు ప్రారంభోత్సవాలు చేశారన్నారు.