RR: షాద్నగర్ పట్టణ పరిధిలోని చటాన్ పల్లి వద్ద ఉన్న బాలుర హాస్టల్లో డిస్ట్రిక్ట్ లెవల్ స్పోర్ట్స్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ACP లక్ష్మి నారాయణ, సీఐ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్రీడలలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడల ద్వారానే బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలన్నారు.