కృష్ణా: మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి అడిషనల్ ఎస్పీ వివి నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబుల్ కలాం ఆశయాలు భారత దేశాన్ని విద్యారంగంలో నూతన శిఖరాలకు తీసుకువెళ్లాయని వివి నాయుడు తెలిపారు.