KNR: బాలికల్లో ధైర్యం, భరోసా నింపేందుకే స్నేహిత కార్యక్రమం, మహిళలకు ఆరోగ్యం పై అవగాహన పెంచేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం గంగాధర మండలం గర్షకుర్తి ప్రభుత్వ పాఠశాలలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్నేహిత-2 అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.