BHNG: భూదాన్ పోచంపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులకు గణితాన్ని బోధించారు. విద్యార్థులను పాఠశాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేసి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందిస్తున్నారా లేదా అని పరిశీలించారు.