WGL: నర్సంపేట మండలం చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన సాయికుమార్ ఇటీవల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు, MLA దొంతి మాధవ రెడ్డికి తెలియజేశారు. స్పందించిన ఎమ్మెల్యే CMRF పథకం కింద లక్ష రూపాయలు మంజూరు చేశారు. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి చెక్కును అందజేశారు.