తమిళనాడుకు చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్ని రోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా స్టార్ హీరో అజిత్ నివాసానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, నిన్న హీరోయిన్ త్రిష నివాసానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు తనిఖీ చేసి అది నకిలీ బాంబు బెదిరింపుగా తేల్చారు.