E.G: బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలు వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. ఇందులో భాగంగా పబ్లిక్ హెల్త్ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రస్తుతం ఉన్న చెత్త సేకరణ పాయింట్లను తక్షణమే తొలగించాలన్నారు. అనంతరం ఉదయం 6:30 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో డోర్ టూ డోర్ చెత్తసేకరణ మొదలవ్వాలని ఆదేశించారు.