కృష్ణా: బాపులపాడు మండలం ఆరుగొలను జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మృతుడు ఆరుగొలనుకు చెందిన బాలరాజు (80)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.