NRML: కడెం మండలం మిద్దచింత గ్రామంలో రోడ్డు, కరెంటు తదితర సమస్యలు పరిష్కరించాలని CPI(ML) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేష్ మాట్లాడుతూ.. గ్రామంలో గత 50 ఏళ్లుగా గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని లేకపోతే గిరిజనులతో కలిసి దశల వారిగా ఆందోళనలు చేస్తామన్నారు.