KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేశారు. ప్రజలు తమ ఇబ్బందులను నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సంబంధిత లబ్ధిదారులకు అందజేశారు.