E.G: అపార్ ఐడి ద్వారా విద్యార్థులు సులభంగా మెరుగైన సేవలు పొందవచ్చని రాజమండ్రి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందులో భాగంగా యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.