KMM: ఖమ్మం రూరల్ మండలంలోని పలు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తనీఖీ చేశారు. జీ.ఆర్.ఆర్ జిన్నింగ్ మిల్స్ సెంటర్, పొన్నేకల్లులోని సీసీఐ కేంద్రాన్ని సందర్శించి పత్తి కొనుగోలు ప్రక్రియ, ట్యాబ్ ఎంట్రీ, గేట్ ఎంట్రీ పాస్, పంట నమోదు వివరాలను పరిశీలించారు. రైతుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.