తూర్పుగోదావరి జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా డాక్టర్ బి. శ్రీదేవి నియమితులయ్యారు. ఆమె DMHO కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి, అనంతరం DMHO డాక్టర్ కె. వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇదే కార్యక్రమంలో డిప్యూటీ DEOగా పి. సత్యవతి కూడా బాధ్యతలు స్వీకరించారు.