ప్రకాశం: సంతనూతలపాడు మండలం ఏనికేపాడు ZPHS పాఠశాలను జిల్లా డిప్యూటీ DEO చంద్రమౌలేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పరీక్షలు పెడుతున్న తీరును పరిశీలించారు. పరీక్షలు పూర్తయిన వెంటనే పరీక్షా పత్రాలు మూల్యాంకనం చేసి మార్కులను ఆన్లైన్లో పొందుపరచాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.