VZM: ఇష్టానుసారంగా రోడ్ల ప్రక్కన డెబ్రిస్ వేసే వారిపట్ల కఠన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఇలా వేసే వారిని సమీపంలోని సీసీ కెమెరాల ద్వారా గుర్తించాలని అధికారులకు సూచించారు. డెబ్రిస్ వేసినట్లు నిర్ధారణ అయితే వారికి రూ.లక్షకు తక్కువ కాకుండా జరిమానా విధించాలని స్పష్టం చేశారు.