E.G: గోకవరం మండల కేంద్రంలో టెన్త్ క్లాస్ పరీక్షలకు సంబంధించిన 5 సెంటర్లను ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కమిషనర్ ఎం. అమలాకుమారి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పరీక్షా సెంటర్లను పరిశీలించడం జరిగినట్టు ఆమె తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విద్యార్థుల ర్యాంకులు, పర్సంటేజ్ పెంపుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.