KRNL: ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో ప్రతిష్ఠించిన బంగారమ్మ గుడిని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐకమత్యంతో దేవాలయాన్ని నిర్మించిన గ్రామ ప్రజలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా దేవస్థాన నిర్వహణ కోసం తనవంతుగా రూ. 50,000 విరాళాన్ని గ్రామ పెద్దలకు అందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.