PDPL: కమాన్ పూర్ మండలంలోని ముల్కలపల్లి, రాజాపూర్, గుండారం, పేరపల్లి, నాగారం, సిద్ధిపల్లెలో వరి కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ ఛైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. రైతులు దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధరకు ధాన్యం విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడుతోందన్నారు.