WGL: జిల్లా కేంద్రంలో టీ-శాట్, TSPGHM అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నల్లబెల్లి మండల ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు నమృత, సిరిలు ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా నమృత, సిరిలను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. ఈ విజయం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు.